VIDEO: వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ

VIDEO: వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ

ఖమ్మం నగరంలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. స్థానిక గుట్టల బజార్ ప్రాంతానికి చెందిన వృద్ధురాలు యక్కల పుష్పావతి ఇంటి ముందు నిలబడి ఉండగా, గుర్తుతెలియని, వ్యక్తి బైక్‌పై వచ్చి ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును లాక్కుని పారిపోయాడు. ఈ ఘటనపై వృద్ధురాలి కుటుంబీకులు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.