ఆదోని ఆర్టీసీ డిపో వద్ద నిరసనలు

ఆదోని ఆర్టీసీ డిపో వద్ద నిరసనలు

కర్నూలు: ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుండే బస్సులను అడ్డుకోవడంతో, బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లా సాధన సమితి నాయకులు ఆర్టీసీ డిపో వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకోగా, జేఏసీ నాయకులు కూడా ఆర్టీసీ బస్టాండ్ దగ్గర మహా ధర్నా నిర్వహించారు.