'జిల్లాలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం'
VKB: జిల్లాలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా మోమిన్ పేట మండలంలో ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యింది. మండల వ్యాప్తంగా మొత్తం 29 గ్రామపంచాయతీలు ఉండగా, ప్రస్తుతం 25 గ్రామపంచాయతీలో పోలింగ్ జరగనుంది. 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మండలంలో 39,576 మంది ఓటర్లు ఉన్నారు.