శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు: సీపీ

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు: సీపీ

PDPL: ఆర్టీసీ సమ్మె వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. విధులకు వచ్చే డ్రైవర్లు, కండక్టర్లను బెదిరించినా, దాడులకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రైవేట్ సిబ్బందికి పూర్తి రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే 8712656597 లేదా 100కు కాల్ చేయాలని ఆయన అన్నారు.