ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే
SKLM: పలాసలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శన తొక్కిసలాటలో ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. మంగళవారం స్థానిక మండలం రాగోలు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. సరైన వైద్యం అందుతుందా లేదని బాధితులను అడిగి తెలుసుకున్నారు.