'పరారీలో ఉన్న నిందితుడు అరెస్టు'

అనకాపల్లి: రెండేళ్లుగా పరారీలో ఉన్న గంజాయి కేసు నిందితుడిని అరెస్టు చేసినట్లు నర్సీపట్నం రూరల్ సిఐ ఎల్.రేవతమ్మ శనివారం తెలిపారు. నర్సీపట్నం మండలం గబ్బాడకు చెందిన మాకిరెడ్డి రాజశేఖర్ 2023లో 18 కేజీల గంజాయితో కూడిన కారును వదిలేసి పరారీ కావడంపై కేసు నమోదు అయిందన్నారు. ఈ మేరకు శనివారం పట్టుకున్నామన్నారు.