విషాదంగా ముగిసిన ఐదేళ్ల బాలుడి అదృశ్యం
BHPL: గణపురం మండలం ధర్మరావుపేటలో ఐదేళ్ల బాలుడి అదృశ్యం విషాదంగా ముగిసింది. ట్రాక్టర్ నుంచి పడి బందేల రాకేష్ అనే బాలుడు మృతిచెందాడు. మూడు రోజులుగా కనిపించకపోవడంతో కుటుంబం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టగా సింగరేణి OC-3 డంప్ యార్డ్‌లో కూరుకుపోయిన బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. ట్రాక్టర్ డ్రైవర్ శంకర్‌ను విచారించగా ఈ విషయం బయటకి వచ్చింది.