వివాదానికి దారి తీసిన పోలీసుల కౌన్సెలింగ్
కృష్ణా జిల్లాలో బెట్టింగ్‌ల నియంత్రణకు పోలీసులు చేపట్టిన కౌన్సెలింగ్ ప్రక్రియ రాజకీయ వివాదానికి దారి తీసింది. మచిలీపట్నం రూరల్ సర్కిల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేవలం YCP సానుభూతిపరులనే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కౌన్సెలింగ్‌కు గైర్హాజరైన TDP వర్గీయులపై చర్యలు తీసుకోలేదని విమర్శలు వస్తున్నాయి.