దేవాంగుల వీధిలో డ్రైనేజీ సమస్యకు తక్షణ పరిష్కారం
VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 32వ వార్డు దేవాంగుల వీధిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్యతో స్థానికులు కొన్ని రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానికులు జనసేన నాయకుడు, మాజీ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఆయన సంబంధిత అధికారులకు సమాచారం అందించగా, సిబ్బంది సమస్యను పరిష్కరించారు.