నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
CTR: నగరి పట్టణం పరిధి చింతలపట్టెడ, పరిసర ప్రాంతాల్లో ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది. సబ్ స్టేషన్లలో నిర్వహణ పనుల కారణంగా ఈ అంతరాయం కలుగుతుందని ఏడీ ప్రభాకర్ తెలిపారు. విద్యుత్ వినియోగదారులు గమనించి, విద్యుత్ శాఖ వారికి సహకరించాలని కోరారు.