CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

అన్నమయ్య: సీఎం సహాయ నిధి పేదలకు వరమని ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ అన్నారు. శుక్రవారం ఆయన చిట్వేలి మండల పరిధిలోని మైలపల్లి, గొల్లపల్లి గ్రామాల్లోని పలువురికి మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు అండగా నిలబడమే కూ.టమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.