VIDEO: రామాలయంలో వెండి కిరీటాలు బహుకరణ

VIDEO: రామాలయంలో వెండి కిరీటాలు బహుకరణ

E.G: బిక్కవోలు మండలం పందలపాక రెడ్ల రామాలయంలో స్వామి అమ్మవార్లకు ఆభరణాల బహుకరణ కార్యక్రమంలో గురువారం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామి అమ్మవార్లకు వెండి కిరీటాలు, బంగారు బొట్లు, పంచలోహ పాదుకలు బహుకరించారు. ఇందులో భాగంగా ఆలయానికి వెళ్లిన ఎమ్మెల్యే దంపతులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు.