అసెంబ్లీలో మాట్లాడిన గన్నవరం ఎమ్మెల్యే
కృష్ణా: అసెంబ్లీలో గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, ఇంటర్న్‌షిప్ అవకాశాల ప్రాముఖ్యతను వివరించారు. గతంలో 120 మందికి ఇంటర్న్‌షిప్ కల్పించగా 40 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఇంటర్న్‌షిప్ విధానానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.