ఎక్సైజ్ కేసులలో మహిళ అరెస్ట్

ELR: చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో ఎక్సైజ్ నేరాలకు పాల్పడిన సాదరబోయిన మరియమ్మను అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరు పరిచినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ మస్తానయ్య తెలిపారు. పోలవరంలో ఆయన గురువారం మాట్లాడుతూ.. పలు ఎక్సైజ్ కేసులతో సంబంధం ఉన్న మరియమ్మ తప్పించుకున్నట్లు చెప్పారు. పక్కా సమాచారంతో మరియమ్మను అదుపులోకి తీసుకున్నామన్నారు.