సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన MLA
E.G: కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే పేదలకు సీఎం సహాయనిధి కొండంత అండగా నిలుస్తోందని రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య తెలిపారు. ఆదివారం సాయంత్రం స్థానిక TDP కార్యాలయంలో ఆయన లబ్ధిదారులకు CMRF చెక్కులు అందజేశారు. నియోజకవర్గంలోని 37 మందికి రూ. 31.40 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.