'అడవితల్లి బాట' పనులు వేగవంతం
AP: గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో 'అడవిబాట పనులు' శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మేరకు అల్లూరి జిల్లా డుంబ్రిగూడ పాడి రొడ్డు నుంచి దుడుగుడ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు సాగుతున్నాయి. కాగా ఎన్ని సవాళ్లు ఎదురైనా అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని పవన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.