VIDEO: 'ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి'
SKLM: అరసవల్లిలో నిర్మించనున్న సాంస్కృతిక కళా వేదికకు స్థానిక ఎమ్మెల్యే శంకర్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీ నిధుల ద్వారా రూ.20 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. రథసప్తమి సందర్భంగా స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.