మున్సిపల్ భవనానికి స్థలం సేకరించండి: MLA

మున్సిపల్ భవనానికి స్థలం సేకరించండి: MLA

BDK: మున్సిపాలిటీ పరిధిలోని ఖాళీ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని, పరిపాలనా భవనానికి కావాల్సిన స్థలాన్ని సేకరించాలని మున్సిపల్ కమిషనర్ నాగరాజును ఎమ్మెల్యే ఆదినారాయణ ఆదేశించారు. మండల పరిషత్ పూర్వ కార్యాలయం, సామాజిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. మండలపరిషత్ పూర్వ కార్యాలయం ప్రాంగణంలో, మున్సిపాలిటీ కార్యాలయం నిర్మించడానికి ఆమోదం పొందాలని సూచించారు.