VIDEO: గ్రామాల్లో అభివృద్ధి శూన్యం: కురువ పల్లయ్య
GDL: కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య పేర్కొన్నారు. సోమవారం అయిజ మండలం సంకాపూర్‌లో రోడ్లపై ప్రవహిస్తున్న మురుగు, అపరిశుభ్రతను పరిశీలించి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండేళ్లు అయినా గ్రామాల అభివృద్ధి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదన్నారు.