అరసవిల్లిలో ఘనంగా మహాలింగార్చన కార్యక్రమం

SKLM: శ్రీకాకుళం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో త్రయోదశి సందర్భంగా శివ పంచాయితన సహిత మహాలింగార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గురువారం ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి త్రయోదశి రోజున ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. ఆలయ ఈవో ప్రసాద్ పాల్గొన్నారు.