'విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'
MNCL: సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సమస్యలను యాజమాన్యం పరిష్కరించాలని సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత 26 ఏళ్లుగా కోల్ మైన్స్ పెన్షన్ పెంపుదలకు నోచుకోవడం లేదన్నారు. వెంటనే కరువు భత్యంతో కూడిన పెన్షన్ 50 పెంచాలని, అధికారులకు మాదిరిగా రూ.25 లక్షల వరకు వైద్య ఖర్చులు అందించాలని కోరారు.