మత్స్యకారుల్లో చిగురిస్తున్న ఆశలు

MBNR: వర్షాల కోసం ఎదురుచూస్తున్న మత్య్సకారుల ఆశలు చిగురించాయి. సకాలంలో వర్షాలు లేక ఈ ఏడాది చెరువులు, కుంటలు నిండుతాయో లేదో అనే సందేహంలో ఉన్న వారికి గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తెరదించాయి. ఉమ్మడి జిల్లాల్లో చెరువులు, కుంటలలో జలకళ కనబడుతోంది. చెరువుల్లో నీటి నిల్వ గమనించిన ప్రభుత్వం చేప పిల్లలు వదిలేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది.