నందివాడలో డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి

కృష్ణా: నందివాడ మండలంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 'ఆరోగ్యశ్రీ', 'ఉచిత విద్యుత్','108 అంబులెన్స్', 'జలయజ్ఞం', 'ఫీజు రియంబర్స్‌మెంట్' వంటి ఎన్నో సంక్షేమ పథకాలను వైయస్సార్ ప్రవేశపెట్టారని నేతలు కొనియాడారు.