ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కుటుంబం
వనపర్తిలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ జయరాములు పేరు పెట్టారు. దీంతో పాఠశాలకు తమ తండ్రి పేరును పెట్టడం గర్వించదగ్గ విషయమని మాజీ ఎమ్మెల్యే కూతురు కవిత, కుమారుడు వశిష్టలు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేను కలిసి శాలువాతో సత్కరించారు.