ఎమ్మెల్సీని కలిసిన ఉపాధ్యాయ సంఘాల నేతలు
VZM: 2025లో బదిలీ అయ్యి, వివిధ కారణాలతో ఇంకా రిలీవ్ కాని ఉపాధ్యాయులను ఈనెల 22 లోపు రిలీవ్ చేయాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కే.శ్రీనివాసరాజు కోరారు. ఈ మేరకు విశాఖపట్నంలోని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావును ఆయన కార్యాలయంలో కలిసి ఆదివారం సమస్యను వివరించారు. కలిసిన వారిలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నారు.