కొమరవోలు డ్రైన్, చంద్రయ్య కాలువ నిధులపై వివాదం
కృష్ణా: కొమరవోలు డ్రైన్, చంద్రయ్య కాలువ నిధులపై వివాదం చెలరేగింది. నారా భువనేశ్వరి తీసుకువచ్చిన నిధులను పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మళ్లిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆరోపించారు. బుధవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలో స్థలాన్ని పరిశీలించి, జరుగుతున్న అక్రమాలపై నిజాలు బయటపెడతామని తెలిపారు.