అనకాపల్లిలో రూ.39 లక్షల సైబర్ మోసం
అనకాపల్లిలో యాప్ రేటింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. బాధితుడి నుంచి విడతల వారీగా మొత్తం రూ.39 లక్షలను కాజేశారు. చివరకు మోసపోయానని గ్రహించిన బాధితుడు వినయ్ అనకాపల్లి పోలీసులను ఆశ్రయించాడు. వినయ్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.