తిరుపతిలో నీటి సరఫరా అంతరాయం

తిరుపతిలో నీటి సరఫరా అంతరాయం

తిరుపతి నగరంలోని తెలుగుగంగా పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా ఈనెల 11వ తేదీన నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ముఖ్యంగా రాయల్ నగర్, భైరాగి పట్టెడ, ఎస్టీవీ నగర్, కేసవాయనగుంట ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని, మున్సిపల్ అధికారులకు సహకరించాలని ఆమె కోరారు.