నెల్లూరుకు చేరుకున్న గవర్నర్ అబ్దుల్

నెల్లూరు: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ మంగళవారం రాత్రి నెల్లూరు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఆయనకు జిల్లా అధికారులు స్వాగతం పలికారు. కలెక్టర్ ఎం.హరి నారాయణన్, విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ సుందర వల్లి, ఎస్పీ ఆరీఫ్ హఫీజ్, నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్, జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ పుష్పగుచ్ఛం అందజేశారు.