అంబేద్కర్ విగ్రహం వద్ద పారిశుద్ధ కార్యక్రమాలు

అంబేద్కర్ విగ్రహం వద్ద పారిశుద్ధ కార్యక్రమాలు

ఆదిలాబాద్: బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం పరిసరాల్లో శనివారం పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్తను తొలగించారు. ఆదివారం జరగబోయే అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నాయకులు పేర్కొన్నారు.