రెండుకు చేరిన మృతుల సంఖ్య

రెండుకు చేరిన మృతుల సంఖ్య

TPT: రేణిగుంట యోగానంద కాలేజీ సమీపంలోని నూతన ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద కూలీలపైకి మినీ లగేజ్ లారీ దూసుకెళ్లిన ఘటనలో కూలీ రవణమ్మ అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలైన విషయం విధితమే. తిరుపతి రుయా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరో వ్యక్తి తిరుపాల్(45) మృతి చెందాడు. గాజులమండ్యం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.