'ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు'

'ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు'

SKLM: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దని జిల్లా ట్రైనీ కలెక్టర్ డి.పృథ్వి రాజ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని, జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి పలు వినతులు స్వీకరించారు. వినతులను పరిశీలించి వేగంగా పరిష్కరించాలని అధికారులని ఆదేశించారు.