అప్పటి నుంచే నాలెడ్జీ ఎకానమీ మొదలైంది: CM
AP: మన దగ్గర 1990 తర్వాత ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయని CM చంద్రబాబు అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. 'మన దేశంలో 1991 తర్వాత ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. 1995 నుంచి నాలెడ్జీ ఎకానమీ మొదలైంది. అప్పటికి ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉండేది. ఐటీ కంపెనీలను తీసుకొచ్చేందుకు చాలా మందితో మాట్లాడాను. 15 నెలల్లోనే ఐటీ భవనం కట్టాలని L&T కంపెనీకి చెప్పా' అని పేర్కొన్నారు.