ప్రజల నుంచి వినతులు స్వీకరించిన కలెక్టర్
VSP: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్‌కు ప్రజల నుంచి 292 వినతులు వచ్చాయి. అర్జీల పరిష్కారంపై సమీక్షించిన ఆయన వివిధ అంశాల్లో అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.