'గంజాయి వద్దు.. మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటలు వేయండి'
ASR: డుంబ్రిగుడ మండలం, గుంటసీమ పంచాయితీలో గురువారం పోలీసులు పరివర్తన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఎస్సై పాపినాయుడు మాట్లాడుతూ.. గంజాయి సాగు, రవాణ, వినియోగం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. గంజాయితో జీవితాలు నాశనం చేసుకోవద్దని, గంజాయి బదులు మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటలను, పండ్ల తోటలను సాగుచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, పంచాయితీ ప్రజలు పాల్గొన్నారు.