పోచారం-రంగాపురం మార్గంలో నిలిచిన రాకపోకలు

KMM: ఏన్కూరు మండలం మూలపోచారం-రంగాపురం మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. రహదారిపై వరద నీరు చేరడంతో రైతులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో పోలీసులు వాహనాలను రాకపోకలు నిలిపివేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, సేవాలాల్ విద్యార్థి, స్టేట్ ఆర్గనైజర్ ధారవత్ చందు నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.