ముగిసిన పోషణ్ పక్వాడ పక్షోత్సవాలు
AKP: పోషకాహారంపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం పోషణ్ పక్వాడ పక్షోత్సవాలు నిర్వహించినట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత తెలిపారు. 15 రోజుల నుంచి నిర్వహించిన పక్వాడ పక్షోత్సవాలు గురువారంతో ముగిసాయి. కోటవురట్ల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం నుంచి అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. పిల్లలకు ఆసక్తి కలిగించే విధంగా విద్యాబోధన చేయాలన్నారు.