అదుపుతప్పి ఆటో బోల్తా ఇద్దరికి గాయాలు
అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని గున్నికుంట్ల రోడ్డు సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నాగమణి (22) మరియు నాగేంద్ర (25) అనే భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల సహాయంతో వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం నాగమణి పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్‌కు తరలించారు.