మంత్రి జోగి రమేష్‌కి బోడే ప్రసాద్ సవాల్

ఉయ్యూరు: పెనమలూరు వైసీపీ ఇంఛార్జ్‌గా వచ్చిన గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్‌కి టీడీపి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సవాల్ విసిరాడు. ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలో తాము దాదాపుగా పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. ఈ అసమర్థత మంత్రికి దమ్ముంటే మిగిలి ఉన్న పనులు ఇప్పటికైనా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని సవాల్ విసిరారు.