కొత్తదనం ఏమీ లేదు: జడ్పీ ఛైర్ పర్సన్
VSP: గత ప్రభుత్వం 2023లో తీసుకువచ్చిన డీఎల్డీఓ వ్యవస్థను కూటమి ప్రభుత్వం డీడీఓగా మార్పు చేసిందని, ఇందులో కొత్తదనం లేదని ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్సుభద్ర విమర్శించారు. శుక్రవారం విశాఖ కార్యాలయంలో మాట్లాడుతూ.. జిల్లా పరిషత్‌కు చెందిన భవనాలనే వీటికి కేటాయించినట్లు తెలిపారు. జిల్లా పరిషత్తు నిధులను వీటి ఆధునీకరణకు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.