VIDEO: రెండేళ్ల పాప హత్య కేసులో.. ఇద్దరు అరెస్ట్

VIDEO: రెండేళ్ల పాప హత్య కేసులో.. ఇద్దరు అరెస్ట్

MDK: శివంపేట మండలం శభాష్ పల్లిలో తనుశ్రీ (2) హత్య ఘటనలో తల్లి మమత, ఆమె ప్రియుడు ఫయాజ్‌లను అరెస్టు చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నదని జూన్ 4న తనుశ్రీని హత్య చేసి శభాష్ పల్లిలో పూడ్చిపెట్టినట్లు వివరించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.