VIDEO: యూరియాను అందించి రైతులను ఆదుకోండి: కాంగ్రెస్

E.G: రైతులకు సకాలంలో యూరియాను అందించి, ఆదుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం బొమ్మూరులోని కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. యూరియా కోసం రైతులు రోడ్లెక్కి పడిగాపులు పడాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. యూరియా బ్లాక్ మార్కెట్‌ను నిరోధించాలన్నారు.