వాటర్ ట్యాంక్ వద్ద నిలిచిన మురుగునీరు

వాటర్ ట్యాంక్ వద్ద నిలిచిన మురుగునీరు

NLG: కట్టంగూరులోని రెండో వార్డులో ఉన్న తాగునీటి వాటర్ ట్యాంక్ వద్ద మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తోందని స్థానికులు వాపోయారు. కొద్దిపాటి వర్షానికి కూడా డ్రైనేజీ నీరు ట్యాంకు చుట్టూ నిలిచిపోతోందని, ఈ నీటిని తాగితే రోగాలు వస్తాయేమోనని భయపడుతున్నామని వారు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టి, మురుగునీరు కలవకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.