కాంట్రాక్టర్ వైఫల్యంతోనే రైతులకు కష్టం: మంత్రి
WNP: వీపనగండ్ల మండలం నాగర్లబండ తండా శివారులో తెగిపోయిన రాజీవ్ బీమా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రధాన కాలువను ఇవాళ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ శివారులో కాలువకు ఏర్పడిన గండిని పరిశీలించారు. ఈ పనులను ఈపీసీ చేపట్టిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఈ పరిస్థితి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు.