నూతన ఎస్సైను కలిసిన రాష్ట్ర చేనేత జనసేన కార్యదర్శి

నూతన ఎస్సైను కలిసిన రాష్ట్ర చేనేత జనసేన కార్యదర్శి

KDP: సిద్ధవటం మండల నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ రఫీని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు సమస్యలను ఆయనకు వివరించారు. శాంతిభద్రతలను కాపాడాలని ఎస్సైని కోరినట్లు రాటాల రామయ్య తెలిపారు.