PGRS కార్యక్రమంలో 103 అర్జీలు

కృష్ణా: మచిలీపట్నంలో DRO కే.చంద్రశేఖరరావు నేతృత్వంలో PGRS కార్యక్రమం సోమవారం జరిగింది. మొత్తం 103 అర్జీలు స్వీకరించగా, వాటిని సంబంధిత శాఖలకు వర్చువల్‌గా పంపించారు. రెవెన్యూ శాఖలో పెండింగ్‌లో ఉన్న 23 అర్జీలను 48 గంటల్లో పరిష్కరించనున్నట్లు డీఆర్వో తెలిపారు. పారదర్శక సేవలు, ఖాళీ పోస్టులను కారుణ్య నియామకాలతో భర్తీ చేస్తామన్నారు.