భారీ వర్షాలకు అప్రమత్తంగా ఉండండి: ఎస్సై

KMM: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైరా ఎస్సై పుప్పాల రామారావు సూచించారు. వైరా రిజర్వాయర్ నీటిమట్టం 20 అడుగులకు చేరుకొని, అలుగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయన్నారు. అలుగుల వద్దకు పర్యటకులు నిషేధం అని, చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. అత్యవసర సమయంలో 100 లేదా, 87126 59111కు సమాచారం అందించాలని కోరారు.