భగవద్గీత పోటీల విజేతలకు ఐవీఎఫ్ ఘన సన్మానం
కామారెడ్డి: ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ఆధ్వర్యంలో కల్కి ఆలయంలో నిర్వహించిన భగవద్గీత పారాయణ మహాయజ్ఞంలో భాగంగా గీతా పోటీల్లో బంగారు పతకాలు సాధించిన 13 మందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. భగవద్గీత జ్ఞానం ప్రతి ఒక్కరికీ అవసరమని, విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే గీతా శ్లోకాలు నేర్పించాలని కోరారు.