పెదకాకానిలో లక్ష గాజులతో అమ్మవారికి అలంకారం

GNTR: పెదకాకాని శివాలయంలో శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ అమ్మవారికి లక్ష గాజులతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ పూజల్లో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారని ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ మీడియాకు తెలిపారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.