VIDEO: జంగారెడ్డిగూడెం మద్ది ఆలయం మూసివేత
ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని చంద్రగ్రహణ సందర్భంగా మంగళవారం మూసివేశారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం విశేష పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం ఆలయాన్ని మూసివేయడం జరిగింది. తిరిగి బుధవారం ఉదయం సంరక్షణ అనంతరం స్వామివారి నిత్య కైంకర్యాలు జరిపించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు.